టీడీపీ హయాంలోనూ అవినీతి జరిగింది.. మేం కూడా సత్యవంతులం ఏమీ కాదు: ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి
- అవినీతి కొత్త కాదన్న ఎమ్మెల్యే రామిరెడ్డి
- గతంలో బీద రవిచంద్ర రూ. 400 కోట్ల దోపిడీకి పాల్పడ్డారని ఆరోపణ
- పురపాలక అధికారులు మామూళ్లు డిమాండ్ చేస్తే తనకు చెప్పాలన్న ఎమ్మెల్యే
అప్పట్లో బీద రవిచంద్ర రూ. 400 కోట్ల దోపిడీకి పాల్పడ్డారని ప్రతాప్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆయనతోపాటు టీడీపీ నియోజకవర్గ బాధ్యుడు మాలేపాటి సుబ్బారాయుడు గ్రావెల్ దోపిడీకి పాల్పడ్డారన్నారు. పురపాలక అధికారులపై విమర్శలు వస్తున్నాయని, ఇకపై అలాంటి వాటికి తావులేకుండా చూస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఇళ్ల నిర్మాణాల ప్లాన్లకు పురపాలక అధికారులు మామూళ్లు డిమాండ్ చేస్తే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు.