Rajanikanth: 'జైలర్' నుంచి హాస్యనటుడు సునీల్ లుక్ .. పోస్టర్ రిలీజ్!

  • 'జైలర్'గా కనిపించనున్న రజనీకాంత్ 
  • ముఖ్య పాత్రలలో మోహన్ లాల్.. సునీల్ 
  • మరోసారి రజనీతో కలిసి కనిపించనున్న రమ్యకృష్ణ
  • ఏప్రిల్ 14వ తేదీన సినిమా రిలీజ్ 
Jailer Movie Update

రజనీకాంత్ కథానాయకుడిగా 'జైలర్' సినిమా రూపొందుతోంది. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రజనీకాంత్ 'జైలర్'గా డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నారు. కథ అంతా కూడా జైలుతో ముడిపడిన జైలర్ చుట్టూ తిరుగుతుంది. 

ఈ సినిమాలో హాస్యనటుడు సునీల్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఆయన లుక్ కి సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఆయన పాత్ర .. బాడీ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ గా ఉండనున్నాయనే సంగతి ఈ పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. 

ఇక ఇతర ముఖ్యమైన పాత్రలలో రమ్యకృష్ణ .. శివరాజ్ కుమార్ .. యోగబాబు కనిపించనున్నారు. ప్రత్యేకమైన పాత్రను మోహన్ లాల్ పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను, ఏప్రిల్ 14వ తేదీన తమిళంతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేయనున్నారు.

More Telugu News