నాని సినిమా విలన్ తో తమన్నా ప్రేమలో పడిందా?
- గోవాలో న్యూ ఇయర్ వేడుకలో పాల్గొన్న తమన్నా, విజయ్
- ఇద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్
- ఎంసీఏ సినిమాలో విలన్ గా తెలుగు ప్రేక్షకులకు చేరువైన విజయ్
బాలీవుడ్ లో నటుడిగా పాప్యులర్ అయిన విజయ్ వర్మ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచతమే. 2017లో నాని హీరోగా నటించిన ఎంసీఏలో తను విలన్ గా నటించాడు. తమన్నా భాటియా, విజయ్ వర్మ లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో కలిసి నటిస్తున్నారు. ఈ సిరీస్ సెట్స్‌లో తొలిసారి కలుసుకున్నారు. షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. డిసెంబర్ 21న తమన్నా పుట్టిన రోజున విజయ్.. తమన్నా నివాసంలో కనిపించాడు. ఆ తర్వాత పలు ఈవెంట్లకు వీరు జంటగా కలిసి వెళ్లారు. అయితే, తమ బంధం గురించి తమన్నా ఇప్పటిదాకా పెదవి విప్పలేదు.