‘లక్కీ లక్ష్మణ్’ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం: హీరో సొహేల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘లక్కీ లక్ష్మణ్’ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం: హీరో సొహేల్

Lucky Lakshman will be a family entertainer says Sohel
  • సొహేల్, మోక్ష జంటగా 'లక్కీ లక్ష్మణ్'
  • డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం
  • తమ చిత్రాన్ని ఆదరించాలని కోరిన సొహేల్
బిగ్ బాస్ ఫేమ్ స‌య్య‌ద్ సొహేల్, మోక్ష హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘లక్కీ లక్ష్మ‌ణ్’. ద‌త్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యాన‌ర్‌పై ఎ.ఆర్‌. అభి దర్శ‌క‌త్వంలో హ‌రిత గోగినేని ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 30న సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా ‘ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను బుధవారం నిర్వహించారు. ఈవెంట్‌లో బిగ్ టికెట్‌ను డైరెక్టర్ అభి తండ్రి గంగిరెడ్డి ఆవిష్కరించి సోహైల్ తండ్రి సలీమ్‌కి అందించారు. 

ఈ సందర్భంగా సొహేల్ మాట్లాడుతూ.. 'నేను ఈ స్థాయికి రావడానికి కారణం తెలుగు ప్రజలు. ప్రతీ సక్సెస్ మెన్ వెనుక ఉమెన్ ఉంటుందని అంటారు. కానీ నా సక్సెస్ వెనుక మా నాన్న ఉన్నాడు. నాకు వచ్చిన డబ్బుల్లో కొంత సాయం చేయడమే నాకు తెలుసు. నాకు సినిమా తప్ప ఇంకోటి తెలియదు. మా నిర్మాత హరిత గారు ఈ సినిమాను ఓన్‌గా రిలీజ్ చేస్తున్నారు. డైరెక్టర్ అభి ఎంతో కష్టపడ్డారు. సినిమా కంటెంట్‌ను నమ్మి చేస్తున్నామని డైరెక్టర్ ఎప్పుడూ చెబుతూనే వచ్చారు. ఇది ఫ్యామిలీ సబ్జెక్ట్. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. 

సినిమాలో నటించిన రాజా రవీంద్ర, దేవీ ప్రసాద్, షానీ అన్న ఇలా అందరికీ థాంక్స్. తెలుగు ప్రజలే నా ధైర్యం. మీరే నా సినిమాను ముందుకు తీసుకెళ్లాలి. ఎప్పుడూ ఆదరిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. అనూప్ అన్న మంచి సంగీతాన్ని అందించారు. ఆండ్రూ గారి కెమెరా వర్క్ బాగుంది. హరిత గారు డేరింగ్ అండ్ డాషింగ్ నిర్మాత. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ప్రేక్షకులు నవ్వుతారు, ఏడుస్తారు. డిసెంబర్ 30న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి' అని అన్నారు.
Advertisement
Lucky Lakshman
Sohel
Tollywood

More Telugu News