రియా సుమన్ కి ఈ సారైనా హిట్ పడేనా?
- 2016లోనే ఎంట్రీ ఇచ్చిన రియా సుమన్
- నాని జోడీగా చేసిన 'మజ్ను' ఆమె ఫస్టు మూవీ
- రెండో సినిమాగా నిరాశపరిచిన 'పేపర్ బాయ్'
- ఇక ఆశలన్నీ ఈ సినిమాపైనే
- ఈ నెల 30న విడుదలవుతున్న సినిమా
అలా ఆమె చేసిన రెండో సినిమానే 'పేపర్ బాయ్'. ఈ సినిమాలోని ఇద్దరు హీరోయిన్స్ లో రియా ఒకరు. సంతోష్ శోభన్ జోడీగా రియా చేసిన ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అందువలన సహజంగానే ఈ బ్యూటీకి గ్యాప్ వచ్చేసింది. మళ్లీ ఇప్పుడు 'టాప్ గేర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది.
ఆది సాయికుమార్ హీరోగా చేసిన ఈ సినిమా ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. లవ్ ..రొమాన్స్ ను టచ్ చేస్తూ సాగే యాక్షన్ మూవీ ఇది. ఈ సినిమాతోనైనా రియాకి హిట్ పడుతుందేమో చూడాలి. ఇక కొంత కాలంగా వరుస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆది సాయికుమార్ కి కూడా ఈ సినిమా హిట్ చాలా అవసరం.
.