టీడీపీ ఎంపీగా సత్యనారాయణ అప్పట్లో ఘన విజయం సాధించారు: అచ్చెన్నాయుడు
- సత్యనారాయణ మరణం తెలుగువారికి, సినీ పరిశ్రమకు తీరని లోటన్న అచ్చెన్న
- 60 ఏళ్ల పాటు తిరుగులేని నటుడిగా ఖ్యాతినార్జించారని కితాబు
- తనదైన శైలిలో ప్రజ్ఞాపాటవాలతో ప్రజల్ని మెప్పించారని ప్రశంస
అలానే 1996లో మచిలీపట్నం (బందరు) ఎంపీగా తెలుగుదేశం నుంచి పోటీ చేసిన సత్యనారాయణ ఘనవిజయం సాధించి, రాజకీయ అరంగేట్రం చేశారని చెప్పారు. సినీ, రాజకీయరంగాలలో తనదైన శైలిలో ప్రజ్ఞాపాటవాలతో ప్రజల్ని మెప్పించిన వ్యక్తి మరణం తెలుగుజాతికే తీరనిలోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.