Advertisement

విజయవాడలో సెక్స్ స్కామ్ జరిగింది: బొండా ఉమ

Sex scam happened in Vijayawada says Bonda Uma
  • సంకల్పసిద్ధి స్కామ్ లో కొడాలి నాని, వంశీల హస్తం ఉందన్న బొండా ఉమ
  • విజయవాడ సెక్స్ స్కామ్ వెనుక వైసీపీ నేతలు ఉన్నారని ఆరోపణ
  • జగన్ కు దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు రావాలని సవాల్
సంకల్పసిద్ధి స్కామ్ లో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీల హస్తం ఉందని టీడీపీ నేత బొండా ఉమ ఆరోపించారు. విజయవాడలో బయటపడ్డ ఈ స్కామ్ చాలా పెద్దదని అన్నారు. ఈ కుంభకోణంలో వంశీ, ఆయన అనుచరుడి పాత్రను బయటపెట్టాలని కోరారు. విజయవాడలో సెక్స్ స్కామ్ కూడా జరిగిందని చెప్పారు. కాలేజీ విద్యార్థినులను వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అన్నారు. ఈ సెక్స్ స్కామ్ వెనుక కూడా వైసీపీ నేతల హస్తమే ఉందని చెప్పారు. 

బీసీ, దళిత సామాజికవర్గ ప్రజలను ముఖ్యమంత్రి జగన్ నమ్మించి మోసం చేశారని బొండా ఉమ విమర్శించారు. నవరత్నాల పేరుతో రాష్ట్రానికి నవ బొక్కలు పెట్టారని ఎద్దేవా చేశారు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటామని జగన్ అంటున్నారని... జగన్ కు దమ్ముంటే, అంత నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం ద్వారా 2 కోట్ల మంది ప్రజలను టీడీపీ కలుస్తుందని చెప్పారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాలతోనే పోలవరం ప్రాజెక్టుకు వెళ్లకుండా చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారని విమర్శించారు.
Advertisement
Bonda Uma
Telugudesam
Jagan
Kodali Nani
Vallabhaneni Vamsi
YSRCP

More Telugu News