Manchu Vishnu: 'జిన్నా' నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్!

  • మంచు విష్ణు హీరోగా 'జిన్నా'
  • యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ నేపథ్యంలో సాగే కథ 
  • గ్లామర్ డోస్ పెంచిన పాయల్ - సన్నీ 
  • ఈ నెల 21వ తేదీన భారీ రిలీజ్ 
Ginna Movie lyrical song released

మంచు విష్ణు హీరోగా సూర్య దర్శకత్వంలో 'జిన్నా' సినిమా రూపొందింది. విష్ణు సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితమైంది. రొమాంటిక్ టచ్ తో నడిచే యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందింది. గతంలో విష్ణుకి హిట్స్ ఇచ్చిన జి. నాగేశ్వర రెడ్డి ఈ సినిమాకి కథను అందించాడు. కోన వెంకట్ స్క్రీన్ ప్లే ను సమకూర్చిన ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ ఆసక్తిని పెంచుతూ వచ్చాయి.

అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి బాణీలను అందించాడు. ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు మంచి మార్కులను దక్కించుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను వదిలారు. 'జారు మిఠాయా' అంటూ ఈ పాట సాగుతోంది. హీరోను రెచ్చగొడుతూ సన్నిలియోన్ నటించిన రొమాంటిక్ సాంగ్ ఇది. కాస్త నాటు శృంగారంతో కూడిన సాహిత్యమే కనిపిస్తుంది. మాస్ ను దృష్టిలో పెట్టుకుని చేసిన సాంగ్ ఇది. ఈ పాటకు గణేశ్ సాహిత్యం అందించాడు.

ఈ సినిమాలో విష్ణు సరసన నాయికలుగా పాయల్ - సన్నీలియోన్ అందాల సందడి చేయనున్నారు. ఈ ఇద్దరు భామలు కూడా ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ కి ఒక రేంజ్ లో గ్లామర్ టచ్ ఇచ్చారనే విషయం అర్థమవుతోంది. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళ, హిందీ భాషల్లోను విడుదల చేస్తున్నారు. కొంతకాలంగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న విష్ణుకి ఈ సినిమా ఆ ముచ్చట తీరుస్తుందేమో చూడాలి.

More Telugu News