ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ కస్టడీకి అభిషేక్ రావు
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో అభిషేక్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ
- తన ఖాతాలోకి వచ్చిన నిధులపై అభిషేక్ వివరాలు చెప్పడం లేదన్న సీబీఐ
- 3 రోజుల పాటు అభిషేక్‌ను సీబీఐ కస్టడీకి అనుమతించిన కోర్టు
విచారణలో భాగంగా... అభిషేక్ ఖాతాలోకి రూ.3.5 కోట్ల మేర నిధులు వచ్చాయని గుర్తించామన్న సీబీఐ అధికారులు... ఆ నిధులను అభిషేక్ వివిధ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టారని ఆరోపించారు. ఆ నిధులు ఎక్కడి నుంచి అందాయన్న విషయంపై ఆరా తీయగా... దానిపై అభిషేక్ సరైన సమాధానం ఇవ్వలేదని కోర్టుకు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అభిషేక్ నుంచి పూర్తి వివరాలు రాబట్టాల్సి ఉందని సీబీఐ అధికారులు కోర్తుకు తెలిపారు. సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు... అభిషేక్‌ను సీబీఐ కస్టడీకి అనుమతించింది.