KTR: తనను మహేశ్ బాబులా ఉన్నావన్న గంగవ్వ వ్యాఖ్యలపై... కేటీఆర్ స్పందన!

KTR response to Gangavva comments on comparing him with Mahesh Babu
షార్ట్స్‌లో చూడండి
కరీంనగర్ లో జరిగిన కరీంనగర్ కళోత్సవాల ముగింపు వేడుకలకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ ఫేం గంగవ్వ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి. వేదికపై గంగవ్వను ప్రత్యేకంగా దగ్గరకు తీసుకుని ఆయన సరదా వ్యాఖ్యలు చేశారు. తాను మహేశ్ బాబులా ఉన్నానని గంగవ్వ చెప్పిందని... ఈ మాట ఆయన వింటే ఫీల్ అవుతారని చమత్కరించారు. 

గంగవ్వా ఎందుకైనా మంచిది ఒకసారి కళ్లు టెస్ట్ చేయించుకో అని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్నఅందరూ నవ్వుల్లో మునిగిపోయారు. ఆ తర్వాత ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... గ్రామీణ ప్రాంతానికి చెందిన గంగవ్వ తన ప్రతిభా పాటవాలతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారని ప్రశంసించారు. 
Go Back to Shorts
KTR
TRS
Gangavva
Mahesh Babu
Tollywood

More Telugu News