'పుష్ప 2' కోసం రంగంలోకి బాలీవుడ్ హీరో!
- సంచలన విజయాన్ని సాధించిన 'పుష్ప'
- 350 కోట్లతో 'పుష్ప 2' నిర్మాణం
- గట్టిగానే కసరత్తు చేస్తున్న సుకుమార్
- పెరుగుతున్న స్టార్స్ సంఖ్య
ఈ నేపథ్యంలో కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతిని తీసుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. అలాగే బాలీవుడ్ నుంచి మనోజ్ బాజ్ పాయ్ ను తీసుకుంటున్నట్టుగా ప్రచారం జరిగింది. అక్కడి నుంచే ఇప్పుడు మరో హీరోను కూడా తీసుకోనున్నట్టుగా సమాచారం. ఈ సినిమాలో ఒక కీలకమైన పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం అర్జున్ కపూర్ ను ఎంపిక చేయనున్నారని అంటున్నారు. ఆ దిశగా చర్చలు జరిగినట్టుగా చెబుతున్నారు.
ఇక రష్మికతో పాటు మరో కథానాయికకి కూడా చోటు కల్పిస్తున్నట్టు సమాచారం. ఐటమ్ సాంగ్ లో కాజల్ మెరవనుందనే టాక్ కూడా బలంగానే వినిపిస్తోంది. మొత్తానికి పాన్ ఇండియా సినిమాకి తగిన స్థాయిలోనే కథలో అన్ని అంశాలను సర్దుతున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చే ఆలోచనలో ఉన్నారు.