YSRCP: టీడీపీ హ‌యాంలో ఉద్యోగుల‌పై ఏసీబీ కేసుల‌పై పునఃస‌మీక్ష‌... హైప‌వ‌ర్ క‌మిటీ ఏర్పాటు

ap government constitutes a high power committe to review acb cases which booked in tdp regime on employess
షార్ట్స్‌లో చూడండి
ఏపీలోని వైసీపీ స‌ర్కారు గురువారం మరో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. టీడీపీ హ‌యాంలో ఉద్యోగుల‌పై అవినీతి నిరోధ‌క శాఖ (ఏసీబీ) దాఖ‌లు చేసిన కేసుల‌ను పునఃస‌మీక్షించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందుకోసం ఏకంగా ఓ హైప‌వ‌ర్ క‌మిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి నేతృత్వంలోని ఈ క‌మిటీలో పరిశ్ర‌మల శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, హోం శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి, న్యాయ శాఖ కార్య‌ద‌ర్శితో కేసు న‌మోదైన ఉద్యోగి శాఖ‌కు చెందిన కార్య‌ద‌ర్శి స‌భ్యులుగా ఉంటారు.

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత జ‌రిగిన ఎన్నికల్లో టీడీపీ విజ‌యం సాధించ‌గా... 2014 నుంచి 2019 వ‌ర‌కు రాష్ట్రంలో టీడీపీ పాల‌న సాగిన సంగతి తెలిసిందే. ఈ స‌మ‌యంలో కొందరు ఉద్యోగుల‌పై ప్ర‌భుత్వం క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించి ఏసీబీ చేత కేసులు పెట్టించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ దిశ‌గా ఏసీబీ కేసులు న‌మోదైన ప‌లువురు ఉద్యోగులు రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ క్ర‌మంలోనే ఈ కేసుల‌పై పునఃప‌రిశీల‌న‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తినిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డిన ఉద్యోగుల కేసుల‌ను ఈ పునఃస‌మీక్ష నుంచి మిన‌హాయింపు ఇచ్చారు.
Go Back to Shorts
YSRCP
Andhra Pradesh
ACB

More Telugu News