తెలంగాణ‌లో కొత్త‌గా 116 క‌రోనా కేసులు

116 new corona cases in telangana
  • హైద‌రాబాద్‌లో 49 కొత్త కేసుల న‌మోదు
  • మిగిలిన జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులు
  • క‌రోనా నుంచి కోలుకున్న 152 మంది
  • ఇంకా చికిత్స పొందుతున్న వారి సంఖ్య 808
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 10,708 శాంపిల్స్ పరీక్షించగా, 116 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 49 కొత్త కేసులు నమోదు కాగా, మిగిలిన ఏ ఒక్క జిల్లాలో కూడా డ‌బుల్ డిజిట్ కేసులు న‌మోదు కాలేదు. ఇంకా 444 మంది ఫలితాలు తెలియాల్సి ఉంది. అదే సమయంలో 152 మంది కరోనా నుంచి కోలుకోగా, కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు. 

తెలంగాణలో ఇప్పటివరకు 8,36,297 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,31,378 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 808 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.
Go Back to Shorts
Telangana
Hyderabad
Corona Virus

More Telugu News