Dangeti Jahnavi: ఔత్సాహిక వ్యోమ‌గామి జాహ్నవికి ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహం.. రూ.50 ల‌క్ష‌ల ఆర్ధిక సాయం అందజేత

  • గ‌తేడాది నాసా ప్రోగ్రామ్‌లో పాల్గొన్న జాహ్న‌వి
  • నాసా ప్రోగ్రామ్‌లో పాల్గొన్న తొలి భార‌తీయురాలిగా రికార్డు
  • ప్ర‌స్తుతం ఇంజినీరింగ్ చ‌దువుతున్న జాహ్న‌వి
  • జాహ్న‌వికి చెక్కు అంద‌జేసిన మంత్రి వేణుగోపాల‌కృష్ణ‌
ap government handed over 50 lack rupees cheque to dangeti hagnavi

ఔత్సాహిక వ్యోమ‌గామి దంగేటి జాహ్న‌వికి ఏపీ ప్ర‌భుత్వం భారీ ప్రోత్సాహ‌కాన్ని అందించింది. వ్యోమ‌గామి కావాల‌న్న జాహ్న‌వి క‌ల సాకారం అయ్యే దిశ‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం ఆమెకు రూ.50 ల‌క్ష‌ల ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు రూ.50 ల‌క్ష‌ల చెక్కును జాహ్న‌వికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌, న‌ర‌సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్ర‌సాద‌రాజులు బుధ‌వారం అంద‌జేశారు. త‌న క‌ల సాకారం అయ్యే దిశ‌గా ఈ మేర ఆర్థిక సాయం చేసిన సీఎం జ‌గ‌న్‌కు జాహ్న‌వి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

ఏపీలోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాల‌కొల్లుకు చెందిన జాహ్న‌వి ప్ర‌స్తుతం ఇంజినీరింగ్ చ‌దువుతోంది. ఓ వైపు ఇంజినీరింగ్ చ‌దువుతూనే అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ నాసా నిర్వ‌హించిన ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొని రికార్డు నెల‌కొల్పింది. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న తొలి భార‌తీయురాలిగానే కాకుండా తొలి ఆసియా ఖండ వాసిగా కూడా జాహ్న‌వి రికార్డు సృష్టించింది. ఈ క్ర‌మంలో తాను వ్యోమ‌గామి కావాల‌న్న సంక‌ల్పంతో సాగుతున్న జాహ్న‌వికి ఏపీ ప్ర‌భుత్వం భారీ ప్రోత్సాహ‌కం అందించింది.

More Telugu News