కోలీవుడ్​ ఎంట్రీకి రెడీ అయిన బాలీవుడ్​ బ్యూటీ

disha patani entry to kollywood
  • దిశా పటానికి సూర్య సరసన నటించే అవకాశం   
  • ‘లోఫర్’ చిత్రంతో అరంగేట్రం చేసిన నటి
  • బాలీవుడ్ లో వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్న దిశ
దిశా పటాని మోడల్ గా మెప్పించి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది. ఈ ముంబై భామ మొదట్లో టాలీవుడ్ తోనే సినిమాల్లోకి వచ్చింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ సరసన ‘లోఫర్‌‌’ చిత్రంతో అరంగేట్రం చేసింది. తర్వాత బాలీవుడ్‌లో వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతోంది. హీరోయిన్ గానే కాకుండా ఐటమ్ సాంగ్స్ తోనూ బిజీగా ఉంది. అలాగే, సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఆమె తరచూ గ్లామర్ ఫొటోలను ఫోస్ట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఓవైపు బాలీవుడ్ లో రాణిస్తున్న దిశ ఇప్పుడు మళ్లీ దక్షిణాదిపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఆమె ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’లో  నటిస్తోంది.

తాజాగా కోలీవుడ్‌ లో అరంగేట్రం చేసేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో సూర్య సరసన నటించే చాన్స్ అందుకున్నట్టు సమాచారం. సూర్య హీరోగా సిరుత్తై శివ దర్శకత్వంలో కొత్త సినిమాను ప్రకటించారు. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఇందులో హీరోయిన్‌గా దిశా పటాని నటిస్తుందని సమాచారం. చిత్ర బృందం ఆమె పేరును అధికారికంగా ప్రకటించలేదు. 

కానీ, సినిమా పూజా కార్యక్రమాల ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి దిశ పేరు కూడా ట్యాగ్ చేసింది. దాంతో, సూర్య సరసన దిశానే హీరోయిన్ గా నటిస్తోందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్యకు జోడీగా ముందుగా పూజా హెగ్డే ఖరారైందని వార్తలొచ్చాయి. చివరకు దిశా పటానిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. గతంలో ఓ యాడ్ లో సూర్యతో కలిసి నటించిన అనుభవం దిశాకు ఉంది. కాగా, సూర్య కెరీర్ లో ఇది 42వ చిత్రం. ఈ  పీరియాడికల్ చిత్రాన్ని త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ తో ముందుకు తీసుకెళ్లనున్నారు.
Go Back to Shorts
Bollywood
Kollywood
Disha patani
surya

More Telugu News