బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కంటెస్టెంట్లు వీరేనంటూ.. పెద్ద ఎత్తున ప్రచారం!
- సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బిగ్ బాస్ సీజన్ 6
- ఈసారి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్న నాగార్జున
- ఉదయభాను, బాలాదిత్య, చలాకీ చంటి తదితరులు కంటెస్టెంట్లుగా ఉన్నారంటూ ప్రచారం
మరోవైపు బిగ్ బాస్ సీజన్ 6 సెప్టెంబర్ 4 నుంచి ప్రసారం కాబోతోంది. ఈ సీజన్ కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు. బిగ్ బాస్ సీజన్ 1కు జూనియర్ ఎన్టీఆర్, సీజన్ 2కు నాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా... సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5లను నాగ్ హోస్ట్ చేశారు. ఈ సీజన్ కు కూడా ఆయనే హోస్ట్ గా కొనసాగనున్నారు.