Kajal Aggarwal: మళ్లీ మేకప్ వేసుకోనున్న కాజల్ అగర్వాల్!

  • కమలహాసన్ ఇండియన్ 2 తో ఎంట్రీ
  • సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానున్న షూటింగ్
  • డెలివరీ తర్వాత ఆరు నెలలకే తిరిగి రానున్న కాజల్
Kajal Aggarwal to make acting comeback after welcoming first child to join Indian 2 sets from September

పెళ్లి చేసుకుని, మాతృత్వం కోసం బ్రేక్ తీసుకున్న కథానాయిక కాజల్ అగర్వాల్ మళ్లీ మేకప్ వేసుకోవడానికి రెడీ అవుతోంది. నేహా ధూపియాతో ఇన్ స్టా గ్రామ్ లో లైవ్ చాట్ సందర్భంగా ఈ విషయాన్ని కాజల్ స్వయంగా వెల్లడించింది. సెప్టెంబర్ 13 నుంచి కమలహాసన్ కు చెందిన ఇండియన్ 2 సినిమాతో షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు కాజల్ వెల్లడించింది. సెట్స్ లో ప్రమాదం వల్ల ముగ్గురు టెక్నీషియన్లు మరణించడంతో రెండేళ్లుగా నిలిచిపోయిన శంకర్ సినిమా మళ్లీ మొదలు కానుందని కాజల్ సమాధానంతో తెలుస్తోంది.

మళ్లీ సినిమాల్లో నటించనున్నట్టు కాజల్ చేసిన ప్రకటన అభిమానులకు సంతోషాన్నిస్తోంది. 1996లో వచ్చిన ఇండియన్ (తెలుగులో భారతీయుడు) సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్నదే ఇండియన్ 2. ఈ సినిమా 60 శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. కాజల్ అగర్వాల్ చివరిగా 'హే సినామిక' సినిమాలో నటించింది. ఈ ఏడాది ఏప్రిల్ లో ఆమె ఓ బాబుకు జన్మనివ్వడం తెలిసిందే.

More Telugu News