రాష్ట్రపతి ఎన్నికల్లో 11 రాష్ట్రాల్లో 100 శాతం పోలింగ్: ఎన్నికల సంఘం ప్రకటన
- ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందన్న ఈసీ
- మొత్తం ఓట్లు వేయాల్సిన వారి సంఖ్య 4,796
- వారిలో 99 శాతం మంది ఓటు వేశారని ప్రకటన
సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసిందని ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 4,796 మంది ఓట్లు వేయాల్సి ఉండగా... వారిలో 99 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని వెల్లడించింది. ఈ సందర్భంగా పీపీఈ కిట్లలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజా ప్రతినిధుల ఫొటోలను ఈసీ విడుదల చేసింది.