ఈ రోజు కట్నం లేకుండా జరిగిన ఓ పెళ్లికి సాక్షి సంతకం పెట్టా: బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- స్వేరో పేరిట కొత్త ఉద్యమాన్ని మొదలుపెట్టిన ప్రవీణ్
- జడ్చర్లలో స్వేరో వివాహం జరిగిందని వెల్లడి
- స్వేరో వివాహాల్లో వరకట్నం నిషేధమని తెలిపిన వైనం
ఈ సందర్భంగా తాను మొదలుపెట్టిన స్వేరో ఉద్యమాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. తాను హాజరైన వివాహంలో స్వేరో ఉద్యమంలో భాగస్వాములుగా ఉన్న యువతీ యువకులే పెళ్లి చేసుకున్నారని తెలిపారు. ఈ వివాహాన్ని స్వేరో వివాహంగా పేర్కొన్న ఆయన స్వేరో వివాహాల్లో వరకట్నం నిషేధం అని తెలిపారు. వరకట్నం లేకుండానే జరిగిన ఈ పెళ్లికి తాను సాక్షిగా సంతకం పెట్టానని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులిద్దరి మధ్య నిలబడి సాక్షి సంతకం పెడుతున్న తన ఫొటోను తన ట్వీట్‌కు ఆయన జత చేశారు.