పెళ్లయినా.. తగ్గదే లేదంటున్న అనుష్క శర్మ
- మాల్దీవుల్లో సముద్ర తీరంలో హల్ చల్
- స్విమ్ సూట్ ధరించి సెల్ఫీలు
- వాటిని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన నటి
‘ఫొటోలను షేరు చేస్తూ.. ‘మీ ఫొటోలను మీరే తీసుకుంటే వచ్చే ఫలితం ఇది’అని ఆమె క్యాప్షన్ పెట్టింది. ఆరెంజ్ స్విమ్ సూట్ ధరించిన ఆమె తలకు టోపీ కూడా పెట్టుకుని కనిపించింది. బీచ్ ఒడ్డున ఎండ మండిపోతోంది. అందుకే ఆమె టోపీ ధరించింది. నటి రుహాని శర్మ క్యూట్ అంటూ కామెంట్ పెట్టింది. ఒక అభిమాని అయితే రెచ్చిపోయి మరీ.. ‘నీవు ఎంతో హాట్. హాట్ నెస్ లో నిన్ను ఎవరూ బీట్ చేయలేరు’అని కామెంట్ చేశారు. చాలా మంది వెరీ హాట్, బ్యూటిఫుల్, గార్జియస్ అంటూ స్పందన తెలియజేస్తున్నారు. కూతురు వామికతో కలసి కోహ్లీ జంట కొద్ది రోజుల క్రితమే మాల్దీవులకు చెక్కేసింది.