నిన్న సోనియాకు.. ఈరోజు ప్రియాంకా గాంధీకి కరోనా పాజిటివ్
- తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని ప్రియాంక వెల్లడి
- హోమ్ ఐసొలేషన్ లో ఉన్నానన్న ప్రియాంక
- తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విన్నపం
తన తల్లికి కరోనా సోకిందని తెలియగానే నిన్న లక్నోలో ఉన్న ప్రియాంక తన టూర్ ను రద్దు చేసుకుని ఢిల్లీకి వచ్చేశారు. అయితే, తన షెడ్యూల్ ను ఎందుకు అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే క్రమంలో లక్నోలో రెండు రోజుల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల నుంచి ఆమె వెనక్కి వచ్చేశారు. ఇంతలోనే ఆమెకు కూడా కరోనా నిర్ధారణ అయింది.