IPL 2022: నేడు హైద‌రాబాద్ గెలిచి తీరాల్సిన మ్యాచ్‌... టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై

mi wins toss and elect to field first
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్ తాజా సీజన్‌లో మంగ‌ళ‌వారం ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో హైద‌రాబాద్ స‌న్ రైజ‌ర్స్ ఓ కీల‌క మ్యాచ్ ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే హైద‌రాబాద్ జ‌ట్టుకు ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు దాదాపుగా లేన‌ట్టేన‌ని చెప్పాలి. ఇప్ప‌టికే ప్లే ఆఫ్స్ నుంచి వైదొల‌గిన ముంబై జ‌ట్టుతో హైద‌రాబాద్ జ‌ట్టు ఈ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నుంది. టాస్ నెగ్గిన ముంబై జ‌ట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఇప్ప‌టిదాకా ఇరు జ‌ట్లు 12 మ్యాచ్‌లు ఆడ‌గా... 5 విజ‌యాల‌తో హైద‌రాబాద్ జ‌ట్టు 10 పాయింట్ల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో 8వ స్థానంలో కొనసాగుతోంది. అదే స‌మ‌యంలో 3 మ్యాచ్‌లు మాత్ర‌మే నెగ్గిన ముంబై జ‌ట్లు కేవ‌లం 6 పాయింట్ల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రి స్థానంలో ఉంది. వెర‌సి ముంబై ఇప్ప‌టికే ప్లే ఆఫ్స్ నుంచి వైదొల‌గ‌గా...ఈ మ్యాచ్‌లో ఓడితే హైద‌రాబాద్ జ‌ట్టు కూడా అదే బాట‌న న‌డ‌వ‌నుంది.
Go Back to Shorts
IPL 2022
Sunrisers Hyderabad
Mumbai Indians

More Telugu News