IPL 2022: డ‌బుల్ హెడ‌ర్‌లో రెండో మ్యాచ్‌... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజ‌స్థాన్‌

rr wins toss and elected to bat first
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్‌లో ఆదివారం జ‌రుగుతున్న డ‌బుల్ హెడ‌ర్‌లో రెండో మ్యాచ్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మ‌ధ్య కాసేప‌టి క్రితం ప్రారంభ‌మైంది. టాస్ నెగ్గిన రాజ‌స్థాన్ ఫ‌స్ట్ బ్యాటింగ్‌కు దిగింది. సెంచ‌రీల‌తో విరుచుకుప‌డుతున్న రాజ‌స్థాన్ స్టార్ బ్యాట‌ర్ జాస్ బ‌ట్ల‌ర్ ఆదిలోనే వికెట్ చేజార్చుకున్నాడు. క‌డ‌ప‌టి వార్త‌లందే స‌రికి రాజ‌స్థాన్ 5 ఓవ‌ర్ల‌లో 1 వికెట్ న‌ష్టానికి 30 ప‌రుగులు చేసింది.

ఇదిలా ఉంటే... ముంబైలోని బ్రాబౌర్న్ స్టేడియంలో జ‌రుగుతున్న ఈ మ్యాచ్ ఇరు జ‌ట్ల‌కు కీల‌కంగా మార‌నుంది. ఈ మ్యాచ్ ఫ‌లితంతో ప్లే ఆఫ్స్‌లో రెండో టీమ్ ఎవ‌రనేది తేలిపోనుంది. 8 విక్ట‌రీల‌తో 16 పాయింట్లు సాధించిన ల‌క్నో... పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానంలో ఉండ‌గా... 7 విజ‌యాల‌తో 14 పాయింట్లు సాధించిన రాజస్థాన్ పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధిస్తే... ల‌క్నో త‌న ప్లే ఆఫ్స్ బెర్తును ఖ‌రారు చేసుకోనుంది.
Go Back to Shorts
IPL 2022
Lucknow Super Giants
Rajasthan Royals

More Telugu News