ఇకపై సినిమాలు చేయను.. పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటా: తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్
- తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడే ఉదయనిధి
- తన తాజా చిత్రం నెంజుకు నిధి ప్రమోషన్స్‌లో కీలక ప్రకటన
- సినీ కెరీర్‌లో 'మామన్నన్' తన చివరి సినిమా అని ప్రకటన
- ఇకపై పూర్తిగా ప్రజా సేవలోనే కొనసాగుతానన్న ఉదయనిధి
ఇటీవల జరిగిన తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో తన తండ్రి నేతృత్వంలోని డీఎంకే తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించిన ఉదయనిధి 'నెంజుకు నిధి' తర్వాత 'మామన్నన్' అనే చిత్రంలో నటిస్తున్నారు. తన సినీ కెరీర్‌లో మామన్నన్ సినిమానే తనకు తుది సినిమా అని ప్రకటించిన ఆయన... ఇకపై తన తండ్రితో కలిసి పూర్తిగా ప్రజా సేవలోనే కొనసాగనున్నట్లు ప్రకటించారు.