గుడ్ లక్, గుడ్ బై.. కాంగ్రెస్ కు షాకిచ్చిన సీనియర్ నేత.. రాహుల్ కు వార్నింగ్
- పార్టీకి సునీల్ జకార్ రాజీనామా
- ఢిల్లీలో కూర్చున్న వాళ్ల వల్లే అధోగతిపాలని వ్యాఖ్య
- సైకోపాత్ ల నుంచి జాగ్రత్తగా ఉండాలంటూ రాహుల్ కు సూచన
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో చింతన్ శిబిర్ జరుగుతున్న సమయంలోనే పార్టీ సీనియర్ నేత రాజీనామా చేయడం పార్టీకి పెద్ద షాక్. ఢిల్లీలో కూర్చున్న వాళ్లే పంజాబ్ లో పార్టీని అధోగతి పట్టించారన్నారు. ఎంపీ అంబికా సోని వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. పంజాబ్ లో హిందూ ముఖ్యమంత్రిని పెడితే దు:ఖాన్ని కొని తెచ్చుకున్నట్టేనన్న ఆమె వ్యాఖ్యలు సరికాదన్నారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ వల్ల కూడా పార్టీ ఓడిపోయిందన్నారు.