Sumanth: ఎమ్మెస్ రాజు తనయుడు హీరోగా 'సతి'

  • ఎమ్మెస్ రాజు నుంచి మరో ప్రేమకథ
  • కొంతసేపటి క్రితం వదిలిన ఫస్టు పోస్టర్ 
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది 
  • కథానాయికగా మెహర్ చాహల్ పరిచయం  
Sathi Movie Update

సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ నుంచి గతంలో ఎన్నో భారీ హిట్లు వచ్చాయి. ఆ బ్యానర్లో సినిమా చేయడానికి స్టార్ హీరోలు సైతం ఉత్సాహాన్ని చూపించేవారు. ఆ తరువాత నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకుడిగా మారిపోయి, ఒక మాదిరి బడ్జెట్ తో ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించడం మొదలుపెట్టారు.

తన తనయుడు సుమంత్ అశ్విన్ తో కూడా సినిమాలు చేస్తూ వస్తున్నారు. అలా చేసిన '7 డేస్ 6 నైట్స్' సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఆ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే ఎమ్మెస్ రాజు తన తనయుడు హీరోగా మరో ప్రాజెక్టును పట్టాలెక్కించారు .. ఆ సినిమా పేరే 'సతి'. ఈ సినిమా షూటింగును మొదలుపెట్టి కొన్ని రోజులు అవుతోందట. 

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. జాతర నేపథ్యంలో ఒక ప్రేమజంటను చూపిస్తూ ఈ పోస్టర్ ను వదిలారు. పోస్టర్ ను చూస్తుంటే ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథగా అనిపిస్తోంది. ఈ సినిమాతో కథానాయికగా మెహర్ చాహల్ పరిచయమవుతోంది. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. 

More Telugu News