Sri Vishnu: ఇలాంటి ఒక క్లైమాక్స్ ఇంతకుముందు చూసుండరు: శ్రీవిష్ణు

  • 'భళా తందనాన' ప్రమోషన్స్ లో శ్రీవిష్ణు
  • తనకి నచ్చిన కథ అంటూ వ్యాఖ్య
  • మణిశర్మ సంగీతం నిలబెడుతుందంటూ వివరణ 
  • తన నెక్స్ట్ మూవీ 'అల్లూరి' అని చెప్పిన శ్రీవిష్ణు  
Bhala Thandanana movie update

శ్రీవిష్ణు కథానాయకుడిగా 'భళా తందనాన' సినిమా రూపొందింది. వారాహి బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, మణిశర్మ సంగీతాన్ని సమకూర్చాడు. కేథరిన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఈ నెల 6వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి శ్రీవిష్ణు మాట్లాడాడు. 

"ఇది ఒక సస్పెన్స్  థ్రిల్లర్ .. ఇంటెన్సివ్ డ్రామాతో కొనసాగుతుంది. ఈ సినిమాలో నేను కామన్ మేన్ గా కనిపిస్తాను. డబ్బుకు సంబంధించిన ఒక కేసులో చిక్కుకుంటాను. జర్నలిస్ట్ పాత్రలో కేథరిన్ నటించింది. ఒక  కామన్ మేన్ కి ఒక జర్నలిస్ట్ తోడైతే ఏం జరుగుతుందనేది కథ. ప్రతి సన్నివేశానికీ .. ప్రతి పాత్రకి ప్రాధాన్యత ఉంటుంది. 

ఈ సినిమాలో ప్రీ క్లైమాక్స్ ..  క్లైమాక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇలాంటి ఒక  క్లైమాక్స్ ఇంతకుముందు చూడలేదే అంటారు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. 'అల్లూరి' అనే ఒక బయోపిక్ లో చేస్తున్నాను. అది కూడా నాకు ఎంతో నచ్చిన కథ .. పాత్ర" అంటూ చెప్పుకొచ్చాడు.

More Telugu News