ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద హైటెన్షన్.. బీజేవైఎం కార్యకర్తల అరెస్ట్
- ఉద్యోగాల భర్తీలో జాప్యంపై బీజేపీ ఆగ్రహం
- ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి పిలుపు
- భారీగా తరలివచ్చిన బీజేవైఎం కార్యకర్తలు
- ఏపీపీఎస్సీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే యత్నం
- బీజేవైఎం శ్రేణులను అరెస్ట్ చేసిన పోలీసులు
ఈ సందర్భంగా సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీజేవైఎం కార్యకర్తలు ఏపీపీఎస్సీ కార్యాలయంలోకి చొచ్చుకుని వెళ్లేందుకు యత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బీజేవైఎం కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. చివరకు బీజేవైఎం కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బీజేవైఎం కార్యకర్తల మెరుపు నిరసనలతో ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది.