Congress: మే 6న తెలంగాణ‌కు రాహుల్‌... వ‌రంగ‌ల్‌లో భారీ బ‌హిరంగ స‌భ‌

  • కాక‌తీయ వ‌ర్సిటీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వ‌ర‌కు ర్యాలీ
  • అనంత‌రం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో రాహుల్ స‌భ‌
congress leader rahul gandhi public meeting in warangal on may 6th

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ మే నెల 6న తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు. ఈ సంద‌ర్భంగా 6వ తేదీన వ‌రంగ‌ల్‌లో భారీ బ‌హిరంగ స‌భ‌కు కాంగ్రెస్ పార్టీ స‌న్నాహాలు చేస్తోంది. అలాగే, వ‌రంగ‌ల్‌లో భారీ ర్యాలీకి కూడా ఆ పార్టీ నిర్ణ‌యించింది. స్థానిక కాక‌తీయ యూనివ‌ర్సిటీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వ‌ర‌కు ఈ ర్యాలీని నిర్వ‌హించాల‌ని ఆ పార్టీ నిర్ణ‌యించింది. ర్యాలీ అనంత‌రం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో రాహుల్ గాంధీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించ‌నుంది.

More Telugu News