మే 20న వస్తున్న రాజ'శేఖర్'!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మే 20న వస్తున్న రాజ'శేఖర్'!

Rajasekhar starred Shekhar set to release
  • జీవిత దర్శకత్వంలో చిత్రం
  • రాజశేఖర్ కుమార్తెల నిర్మాణ భాగస్వామ్యం
  • 'లవ్ గంటే' అనే సింగిల్ కు విశేష స్పందన
  • సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో రాజశేఖర్
ప్రముఖ నటుడు రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'శేఖర్'. ఇటీవల విభిన్న తరహా కథాంశాలను ఎంచుకుంటూ, సెలెక్టివ్ గా చిత్రాలు చేస్తున్న రాజశేఖర్ మరోసారి విలక్షణమైన లుక్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 'శేఖర్' చిత్రం మే 20న విడుదల కానుంది. ఈ సినిమాకు రాజశేఖర్ అర్ధాంగి జీవిత దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమా నిర్మాణంలో రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక కూడా భాగస్వాములు. బీరం సుధాకర్ రెడ్డి, బొగ్గారం వెంకట శ్రీనివాస్ సహ నిర్మాతలు. 

ఈ చిత్రంలో ఆత్మీయ రాజన్, కన్నడ కిశోర్, ముస్కాన్, భరణి, రవి శర్మ, సమీర్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ చిత్రం నుంచి వచ్చిన 'లవ్ గంటే...' పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. రాజశేఖర్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో కొత్తగా కనిపిస్తుండడం పట్ల అభిమానుల్లో ఆసక్తి అధికమవుతోంది. 

కాగా, శేఖర్ చిత్రాన్ని సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేయాలని భావించినా, ఆ నిర్ణయం కార్యరూపం దాల్చలేదు. ఇన్నాళ్లకు రిలీజ్ డేట్ ను చిత్రబృందం కన్ఫర్మ్ చేసింది. ఇది రాజశేఖర్ కెరీర్ లో 91వ చిత్రం. "వాడెప్పుడైనా మనం చెప్పింది చేశాడా... వాడు చేసేది ఎప్పుడైనా మనకు చెప్పాడా" అంటూ సాగే కొన్ని డైలాగులు 'శేఖర్' పాత్ర స్వభావాన్ని వివరిస్తున్నాయి.
Shekhar
Rajasekhar
Release
Jeevitha
Tollywood

More Telugu News