ఆసక్తికర సన్నివేశం!.. బాలినేని వెంట జగన్ వద్దకు కరణం బలరాం!
- బాలినేని ఇంటి వద్ద ప్రత్యేక ఆకర్షణగా కరణం
- జగన్ ఇంటికి బాలినేనితో కలిసి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే
- జగన్‌తో బాలినేని చర్చల్లో కీలక భూమిక పోషించనున్నారని విశ్లేషణలు
అయితే బాలినేనిని తన వద్దకు తీసుకురావాలంటూ స్వయంగా జగన్ ఆదేశించడంతో సోమవారం మూడో మారు బాలినేని ఇంటికి సజ్జల వెళ్లారు. సుదీర్ఘంగా చర్చించిన మీదట జగన్‌ను కలిసేందుకు బాలినేని సమ్మతించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. బాలినేని ఇంటి వద్ద ఆదివారం నుంచి టీడీపీకి దూరంగా జరిగిన ఆ పార్టీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి కనిపించి అందరి దృష్టిని తనవైపునకు తిప్పుకున్నారు. తాజాగా జగన్ ఇంటికి బాలినేని బయలుదేరగా... ఆయన వెంట కరణం కూడా వెళ్లారు. బాలినేనితో చర్చల్లో కరణం కీలక భూమిక పోషించే అవకాశాలు ఉన్నాయన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.