మూడోసారి బాలినేని ఇంటికి స‌జ్జ‌ల‌!.. సీఎం వ‌ద్దకు మాజీ మంత్రిని తీసుకెళ్లేందుకే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మూడోసారి బాలినేని ఇంటికి స‌జ్జ‌ల‌!.. సీఎం వ‌ద్దకు మాజీ మంత్రిని తీసుకెళ్లేందుకే!

sajjala came to balineni house third time
  • ఇప్ప‌టికే రెండు సార్లు బాలినేని ఇంటికి స‌జ్జ‌ల‌
  • మెత్త‌బ‌డ‌ని మాజీ మంత్రి
  • బాలినేనిని త‌న వ‌ద్ద‌కు తీసుకురావాల‌న్న జ‌గ‌న్‌
  • ఆ ప‌ని మీదే మూడోమారు బాలినేని ఇంటికి స‌జ్జ‌ల‌
ఏపీలో మంత్రివ‌ర్గ పునర్వ్యవ‌స్థీక‌ర‌ణ నేప‌థ్యంలో వైసీపీ సీనియ‌ర్ల‌లో నెల‌కొన్న అసంతృప్త రాగాలు ఇంకా చ‌ల్లార‌లేద‌నే చెప్పాలి. గ‌త కేబినెట్‌లో కీల‌క మంత్రిగా కొన‌సాగి.. తాజా మంత్రివ‌ర్గ పున‌ర్వ్యవస్థీక‌ర‌ణ‌లో చోటు ద‌క్క‌ని తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి అల‌క వీడ‌లేదు. దీంతో ఇప్ప‌టికే పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు సజ్జ‌ల రామకృష్ణారెడ్డి ఇప్ప‌టికే రెండు ప‌ర్యాయాలు మాజీ మంత్రి ఇంటికి వెళ్లినా బాలినేని అల‌క వీడ‌లేదు.

తాజాగా సోమ‌వారం ఉద‌యం ముచ్చ‌ట‌గా మూడో ప‌ర్యాయం కూడా బాలినేని ఇంటికి స‌జ్జ‌ల వెళ్లారు. ఈ సారి స‌జ్జ‌ల వెంట పార్టీ సీనియ‌ర్లు గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, త‌ల‌శిల ర‌ఘురాంలో పాటు పెద్ద సంఖ్య‌లో పార్టీ నేత‌లు బాలినేని ఇంటికి త‌రలివెళ్లారు. జ‌గ‌న్ ఆదేశం మేర‌కే బాలినేని ఇంటికి మూడోమారు వ‌చ్చిన స‌జ్జ‌ల‌.. జ‌గ‌న్ ఆదేశించిన‌ట్లుగా బాలినేనిని తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యానికి తీసుకెళ్ల‌నున్నారు. బాలినేనితో స్వ‌యంగా మాట్లాడాలని నిర్ణ‌యించుకున్న జ‌గ‌న్‌.. ఆ మేర‌కు బాలినేనిని త‌న వ‌ద్ద‌కు తీసుకురావాల‌ని స‌జ్జ‌ల‌ను పంపిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.
Balineni Srinivasa Reddy
YS Jagan
YSRCP
Sajjala Ramakrishna Reddy

More Telugu News