రెవెన్యూ లోటు కింద ఏపీకి రూ.28 వేల కోట్లు విడుదల చేసాం .. పార్లమెంటులో కేంద్రం ప్రకటన
- ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం
- 2015 నుంచి 2021 మధ్యలో నిధుల విడుదల
- ఆర్థిక సంఘాల సూచన మేరకే విడుదల చేశామన్న కేంద్రం
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సంధించిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించింది. 2015 నుంచి 2021 మధ్యలో ఏపీకి రెవెన్యూ లోటు కింద రూ.28 వేల కోట్లను విడుదల చేసినట్టు ఇంద్రజిత్ సింగ్ తెలిపారు. ఆర్థిక సంఘాల సిఫారసు మేరకే ఈ నిధులను విడుదల చేశామని కూడా ఆయన వెల్లడించారు.