తెలంగాణలో భానుడి భగభగ.. 11.30 గంటల వరకే స్కూళ్లు
- తెలంగాణలో మండుతున్న ఎండలు
- పాఠశాలల పనివేళలను కుదిస్తూ నిర్ణయం
- 8 గంటల నుంచి 11.30 గంటల వరకే పాఠశాలలు
- ఏప్రిల్ 6 దాకా అమలు చేయాలన్న విద్యాశాఖ
తెలంగాణలో పాఠశాలల పనివేళలను కుదిస్తూ ప్రభుత్వం బుధవారం సాయంత్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం గురువారం నుంచి పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకే నడవనున్నాయి. ఈ మేరకు అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయిన సీఎస్ సోమేశ్ కుమార్ పాఠశాలల పనివేళలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పనివేళలను ఏప్రిల్ 6 దాకా అమలు చేయాలని విద్యా శాఖ ఆయా పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది.