భార్య చేసిన వంట: సోషల్ మీడియాలో నాగచైతన్య, శోభిత ఫన్నీ చాట్!
- శోభిత వంట చేసిన ఫొటోను షేర్ చేసిన చైతూ
- పెళ్లైన రెండేళ్లకు తన కోసం ప్రత్యేకంగా వంట చేసిందని కామెంట్
- ట్రోల్ చేస్తున్నావా లేక పొగుడుతున్నావా అంటూ శోభిత రిప్లై
అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల జంట సోషల్ మీడియాలో చేసే పోస్టులు నిత్యం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. తాజాగా నాగచైతన్య తన భార్య శోభిత వంట చేసిన ఒక ఫొటోను షేర్ చేస్తూ సరదాగా ఒక క్యాప్షన్ పెట్టగా, దానికి శోభిత ఇచ్చిన ఫన్నీ రిప్లై ప్రస్తుతం నెట్ ఇంట్లో వైరల్‌గా మారింది.
"పెళ్లయిన దాదాపు రెండేళ్లకు నా భార్య నా కోసం ప్రత్యేకంగా వంట చేసింది. బహుశా.. ఈ రోజు నేను ఏదో మంచి పనే చేసి ఉంటాను" అంటూ నాగచైతన్య ఇన్స్టాగ్రామ్‌లో శోభిత ఫొటోను పంచుకున్నారు. దీనికి శోభిత తక్షణమే స్పందిస్తూ "నువ్వు నన్ను ట్రోల్ చేస్తున్నావా.. లేక పొగుడుతున్నావా?" అని ఫన్నీ ఎమోజీని జోడిస్తూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ భార్యాభర్తల చిలిపి సంభాషణ అభిమానులను ఎంతగానో అలరిస్తోంది.
ఇక వీరిద్దరి సినిమాల విషయానికొస్తే.. 'తండేల్' సినిమా సక్సెస్ తర్వాత నాగచైతన్య ప్రస్తుతం 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'వృషకర్మ' అనే మైథలాజికల్ చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు శోభిత ఇటీవల 'చీకటిలో' అనే క్రైమ్ థ్రిల్లర్‌లో నటించగా, ప్రస్తుతం పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం 'వెట్టువం' విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.