నార్త్, సౌత్ పరిశ్రమల తేడాలపై తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు!

నార్త్, సౌత్ పరిశ్రమల తేడాలపై తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు!

  • నార్త్ సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు ఎంచుకునే వీలు ఉంటుందన్న తమన్నా
  • దక్షిణాదిన కమర్షియల్ అంశాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని వెల్లడి
  • దీన్ని పురుషాధిక్యతగా చూడకూడదని వ్యాఖ్య

సినీ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా... ఇటీవల 'ఫోర్బ్స్' ఇంటర్వ్యూలో ఉత్తరాది, దక్షిణాది చిత్ర పరిశ్రమల పనితీరుపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. హిందీ సినిమాల్లో నటీనటులకు వైవిధ్యమైన పాత్రలను ఎంచుకునే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని, కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల ద్వారా తమ ప్రతిభను చాటుకునే అవకాశం దక్కుతుందని ఆమె తెలిపారు.


అదే సమయంలో దక్షిణాది చిత్రసీమ వాతావరణం భిన్నంగా ఉంటుందని వివరించారు. సౌత్ పరిశ్రమలో వాణిజ్య (కమర్షియల్) అంశాలకు, స్టార్ క్వాలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, కొందరు దీనిని పురుషాధిక్యతగా భావించినప్పటికీ తన దృష్టిలో అది కేవలం అక్కడి కమర్షియల్ సినిమా వ్యవస్థ అని స్పష్టం చేశారు. వీటిని విమర్శలుగా చూడకూడదని, ఇది తన వ్యక్తిగత అనుభవమని చెబుతూ... ఇండస్ట్రీలో సుదీర్ఘకాలం నిలదొక్కుకోవాలంటే కమర్షియల్, కథా ప్రాధాన్యమున్న పాత్రల మధ్య సమతుల్యత పాటించడం చాలా ముఖ్యమని చెప్పారు.


కాగా, ఇటీవల హిందీలో వచ్చిన 'స్త్రీ 2' చిత్రంలోని 'ఆజ్ కీ రాత్' పాట యూట్యూబ్‌లో ఏకంగా 1 బిలియన్‌కు పైగా వ్యూస్ సాధించి రికార్డు సృష్టించడంతో తమన్నా జాతీయ స్థాయిలో మరోసారి విశేష గుర్తింపు సాధించారు. ప్రస్తుతం సౌత్, నార్త్ సినీ పరిశ్రమల పనితీరుపై తమన్నా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Advertisement

More Telugu News