ప్రభాస్ ముఖ్యఅతిథిగా 'కేజీఎఫ్ 2' ప్రీరిలీజ్ ఈవెంట్!
- యష్ హీరోగా 'కేజీఎఫ్ 2'
- కీలకపాత్రలో సంజయ్ దత్
- ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్
యశ్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో సంజయ్ దత్ కీలకమైన పాత్రను పోషించారు. అందువలన ఈ సినిమా మరింత భారీతనాన్ని సంతరించుకుంది. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించిన విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. ఈ ఈవెంట్ కి ప్రభాస్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ తదుపరి సినిమా అయిన 'సలార్'కి ప్రశాంత్ నీల్ దర్శకుడు. అందువలన ప్రభాస్ ఈ వేడుకకి రావడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే 'సలార్' చాలావరకూ చిత్రీకరణను జరుపుకుందనే సంగతి తెలిసిందే.