జగనన్న విద్యా దీవెన పథకం డబ్బు జమ వాయిదా
- ఈరోజు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పడాల్సిన ఫీజు డబ్బులు
- మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొంటున్న సీఎం జగన్
- పథకం అమలు తేదీని త్వరలో ప్రకటిస్తామన్న అధికారులు
ముఖ్యమంత్రి జగన్ ఈరోజు విజయవాడలో జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో జగనన్న విద్యా దీవెన పథకం వాయిదా పడింది. పథకం అమలు తేదీని త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.