హైదరాబాద్‌లో నిమజ్జనం వివాదం: హైడ్రా వర్సెస్ గణేశ్ ఉత్సవ సమితి

Hyderabad Immersion Controversy HYDRA vs Ganesh Utsav Samithi
  • హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనంపై కొత్త వివాదం
  • తాము అభివృద్ధి చేసిన చెరువుల్లో నిమజ్జనం కుదరదన్న హైడ్రా
  • అడ్డుకునే అధికారం హైడ్రాకు లేదన్న గణేశ్ ఉత్సవ సమితి
  • యథావిధిగా అన్ని చెరువుల్లోనూ నిమజ్జనం చేస్తామని స్పష్టీకరణ
హైదరాబాద్‌లో వినాయక చవితి పండుగ సమీపిస్తున్న తరుణంలో విగ్రహాల నిమజ్జనంపై మరోసారి వివాదం నెలకొంది. తాము పునరుద్ధరించిన చెరువుల్లో విగ్రహాల నిమజ్జనాన్ని అనుమతించబోమని హైడ్రా స్పష్టం చేయడంతో ఈ వివాదం రాజుకుంది. అయితే, ఈ నిర్ణయాన్ని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి తీవ్రంగా వ్యతిరేకించింది.

హైడ్రా ప్రకటనపై గణేశ్ ఉత్సవ సమితి ఘాటుగా స్పందించింది. విగ్రహాల నిమజ్జనాన్ని అడ్డుకునే అధికారం హైడ్రాకు లేదని సమితి స్పష్టం చేసింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని అడ్డుకోవాలని చూడటం తగదని, ప్రతి ఏటా మాదిరిగానే నగరంలోని అన్ని చెరువుల్లోనూ నిమజ్జనం నిర్వహించి తీరుతామని ఉద్ఘాటించింది.

హిందూ పండుగలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదని ఉత్సవ సమితి పేర్కొంది. విగ్రహ నిమజ్జనం వల్ల చెరువులు కలుషితమవుతున్నాయనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని వాదించింది. ఇరుపక్షాల మధ్య నెలకొన్న ఈ భిన్న వాదనలతో ప్రస్తుతం నిమజ్జనంపై గందరగోళం నెలకొంది.
Advertisement
HYDRA
Bhagyanagar Ganesh Utsav Samithi
Ganesh Idol Immersion Hyderabad
Hyderabad Lakes Immersion Controversy

More Telugu News