యశ్ వివాదం: అల్లు అరవింద్‌ను వెనకేసుకొచ్చిన రామ్ గోపాల్ వర్మ
- యశ్‌పై అల్లు అరవింద్ వ్యాఖ్యల వివాదంలోకి ఆర్జీవీ
- అరవింద్ వ్యాఖ్యలను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారని వ్యాఖ్య
- బాహుబలికి ముందు ప్రభాస్ ఎవరికీ తెలియదని ఉదాహరణగా ప్రస్తావన
- అరవింద్ మాటలను అహంకారులే వ్యక్తిగతంగా తీసుకుంటారని కౌంటర్
'కేజీఎఫ్' చిత్రానికి ముందు కన్నడ స్టార్ యశ్ ఎవరో తనకు తెలియదని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ వివాదంపై స్పందిస్తూ వర్మ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా ట్వీట్ చేశారు. అల్లు అరవింద్ వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆయన ఉద్దేశం వేరని స్పష్టం చేశారు.
"కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలు నటీనటులను రాత్రికి రాత్రే స్టార్లుగా నిలబెడతాయి. 'బాహుబలి'కి ముందు ప్రభాస్ హిందీ ప్రేక్షకులకు తెలియదు, అలాగే 'కాంతార' చిత్రానికి ముందు రిషబ్ శెట్టిని కూడా ఎవరూ గుర్తించలేదు. అదేవిధంగా, 'కేజీఎఫ్' సినిమాకు ముందు యశ్ గురించి తెలియదని అరవింద్ అన్నారంతే. ఆయన ఉద్దేశాన్ని సామాన్యులు కూడా సులభంగా అర్థం చేసుకోగలరు" అని వర్మ అభిప్రాయపడ్డారు.
హాలీవుడ్‌లో సైతం స్టార్‌డమ్‌ను బట్టి కాకుండా కథను నమ్ముకునే సినిమాలు తీస్తారని వర్మ ఉదహరించారు. 'గాడ్‌ఫాదర్'కు ముందు మార్లన్ బ్రాండో ఎవరో తనకు తెలియదని, నోలన్ వంటి దర్శకులు కూడా నటుల ఇమేజ్‌పై కాకుండా వారి ప్రతిభ పైనే ఆధారపడతారని పేర్కొన్నారు. మంచి ఉద్దేశంతో చెప్పిన సాధారణ విషయాన్ని కేవలం అహంకారం ఉన్నవారే వ్యక్తిగతంగా తీసుకుంటారని రామ్ గోపాల్ వర్మ ఘాటుగా విమర్శించారు. అల్లు అరవింద్ వ్యాఖ్యలపై వస్తున్న ప్రతిస్పందనలు చూస్తుంటే, విమర్శలు చేస్తున్న వారు ఎలాంటి సినిమాలు తీస్తున్నారో అర్థమవుతోందని ఆయన చురకలంటించారు.