తెలంగాణలో కొత్తగా 164 కరోనా కేసులు... అప్ డేట్స్ ఇవిగో!

Telangana corona daily update
  • గత 24 గంటల్లో 31,303 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 61 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 385 మంది
  • ఇంకా 2,386 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 31,303 కరోనా పరీక్షలు నిర్వహించగా, 164 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో 61 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. అదే సయయంలో 385 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన ఒక్కరోజులో మరణాలేవీ సంభవించలేదు. 

రాష్ట్రంలో ఇప్పటిదాకా 7,89,401 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,82,904 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,386 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటివరకు 4,111 మంది మరణించారు.
Go Back to Shorts
Telangana
Corona Virus
Daily Update
Today Cases

More Telugu News