తెలంగాణలో 154 కరోనా కేసులు... తాజా బులెటిన్ ఇదిగో!
- గత 24 గంటల్లో 24,576 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 52 కొత్త కేసులు
- ఇంకా 2,607 మందికి చికిత్స
ఇప్పటిదాకా తెలంగాణలో మొత్తం 7,89,237 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,82,519 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,607 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

.