అమెరికా సైన్యంలో న్యాయవాదిగా చేరిన తమిళ నటి అఖిల నారాయణన్
- అమెరికా సైన్యానికి న్యాయ సలహా సేవలు
- యుద్ధ శిక్షణ పూర్తి కావడంతో చేరిక
- ఆమె ఆధ్వర్యంలో సంగీత పాఠశాల సైతం నిర్వహణ
అమెరికా సాయుధ దళాల్లోకి చేరడానికి ముందు అఖిల కొన్ని నెలల పాటు అమెరికా సైన్యం ఆధ్వర్యంలో యుద్ధ శిక్షణ సైతం తీసుకున్నారు. ఈ శిక్షణ విజయవంతంగా పూర్తి కావడంతో ఆమె న్యాయవాదిగా చేరినట్టు సమాచారం. అమెరికా సైన్యానికి న్యాయ సలహా సేవలు అందించనున్నారు.
అఖిల నారాయణన్ అమెరికాలోనే ఉంటున్నారు. నైటింగేల్ ఆఫ్ మ్యూజిక్ పేరుతో ఒక సంగీత పాఠశాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాల ద్వారా ఆమె స్వయంగా ఎంతో మందికి శిక్షణ ఇస్తున్నారు.