రేపు విశాఖలో పర్యటించనున్న జగన్.. షెడ్యూల్ ఇదే!
- మిలాన్-2022లో పాల్గొననున్న జగన్
- రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖ చేరుకోనున్న సీఎం
- రాత్రి 7.15 గంటలకు తిరుగుపయనం
జగన్ విశాఖ షెడ్యూల్ వివరాలు:
- ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆయన విశాఖ చేరుకుంటారు.
- విమానాశ్రయం నుంచి నేవల్ డాక్ యార్డ్ కు వెళతారు.
- అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
- అనంతరం ఐఎన్ఎస్ వేలా సబ్ మెరైన్ ను సందర్శిస్తారు.
- ఆ తర్వాత ఏపీ ప్రభుత్వ సర్క్యూట్ హౌస్ కు వెళతారు.
- సాయంత్రం 5.30 గంటలకు ఆర్కే బీచ్ కు చేరుకుంటారు.
- ఆర్కే బీచ్ లో జరిగే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ మిలాన్-2022లో పాల్గొని, ప్రసంగిస్తారు.
- రాత్రి 7.15 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు నుంచి తిరుగుపయనమవుతారు.