వరల్డ్ నెంబర్ వన్ చెస్ క్రీడాకారుడు మాగ్నస్ కార్ల్ సన్ ను కంగుతినిపించిన భారత చిచ్చరపిడుగు
- ఎయిర్ థింట్స్ చెస్ టోర్నీలో సంచలనం
- కార్ల్ సన్ కు ఓటమి రుచిచూపిన ప్రజ్ఞానంద
- 39 ఎత్తుల్లో గేమ్ ముగించిన భారత టీనేజర్
- ప్రజ్ఞానంద వయసు 16 ఏళ్లు
మూడు వరుస విజయాలతో ఊపుమీదున్న కార్ల్ సన్ ఈ పోరులో గెలవడం నల్లేరుపై నడకేనని చెస్ పండితులు అంచనా వేశారు. అయితే, భారత టీనేజర్ ప్రజ్ఞానంద అమోఘమైన మేధాశక్తితో కార్ల్ సన్ జోరుకు కళ్లెం వేశాడు. ఈ టోర్నీలో ప్రజ్ఞానంద 8 రౌండ్ల అనంతరం 8 పాయింట్లతో 12వ స్థానంలో ఉన్నాడు.