గనులశాఖ ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించిన ఏపీ ప్రభుత్వం!
- గనుల శాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డి పేరిట ఉత్తర్వులు
- చర్చలు జరుగుతున్న సమయంలో ఎస్మా ఏమిటని ప్రశ్నిస్తున్న ఉద్యోగులు
- గనుల శాఖలో అత్యవసర సేవలు ఏం ఉంటాయని ప్రశ్న
మరోపక్క ఉద్యోగులపై ఏపీ గనుల శాఖ ఎస్మా ప్రయోగించింది. గనులశాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డి ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఉత్తర్వులపై గనుల శాఖ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల నేతల మధ్య చర్చలు జరుగుతుంటే ఎస్మా ఉత్తర్వులు ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. గనుల శాఖలో అత్యవసర సేవలు ఏం ఉంటాయని ప్రశ్నిస్తున్నారు.