శంషాబాద్‌లో ట్రావెల్స్ బస్సు బీభత్సం.. ఒకరి మృతి
- శంషాబాద్‌లో అదుపుతప్పిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
- హోటల్‌లోకి దూసుకెళ్లడంతో ఒకరు అక్కడికక్కడే మృతి
- ప్రమాదంలో 50 మందికి పైగా గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
- మృతుడు కరీంనగర్ వాసి అజ్మల్‌గా గుర్తింపు
- ఘటనలో మూడు కార్లు కూడా ధ్వంసం
హైదరాబాద్ నగర శివారు శంషాబాద్‌లో సోమవారం ఉదయం ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన బస్సు వేగంగా ఓ హోటల్‌లోకి దూసుకెళ్లడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళన నెలకొంది.
వివరాల్లోకి వెళ్తే.. కిషన్‌గూడలోని సెవెన్‌హిల్స్ ప్రైవేటు ట్రావెల్స్ సంస్థకు చెందిన ఓ బస్సు, ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను తప్పించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రోడ్డు పక్కనే ఉన్న బాలాజీ భవన్ హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో హోటల్‌లో టీ తాగుతున్న వ్యక్తిని బస్సు ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడిని కరీంనగర్ వాసి అజ్మల్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన 50 మందికి పైగా క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతకు హోటల్ ముందు పార్క్ చేసి ఉన్న మూడు కార్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.