Vijay Devarakonda: శివ నిర్వాణతోనే విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ!

Vijay Devarakonda in Shiva Nirvana movie
షార్ట్స్‌లో చూడండి
విజయ్ దేవరకొండ చాలా తక్కువ సినిమాలతోనే స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. ఇంతకుముందు ఆయన చేసిన 'డియర్ కామ్రేడ్' .. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలు ఆశించినస్థాయిలో ఆడలేదు. ఆ తరువాత సినిమాను ఆయన పూరితో చేస్తున్నాడు. 'లైగర్' టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆ తరువాత సినిమాను కూడా ఆయన పూరితోనే చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. 'లైగర్' తరువాత ఆయన శివ నిర్వాణ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఉండనుందనే టాక్ ఇంతకుముందే వచ్చింది. తాజాగా స్క్రిప్ట్ లాక్ చేసినట్టుగా చెబుతున్నారు.

విజయ్ దేవరకొండ - శివ నిర్వాణ కలిసి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నారు. శివ నిర్వాణ నుంచి వచ్చిన 'నిన్నుకోరి' .. 'మజిలీ' యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఆ తరువాత చేసిన 'టక్ జగదీశ్' ఫ్యామిలీ ఆడియన్స్ తో ఫరవాలేదనిపించుకుంది. ఇక విజయ్ దేవరకొండతో చేసే సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
Go Back to Shorts
Vijay Devarakonda
Puri Jagannadh
Shiva Nirvana Movie

More Telugu News