Varun Tej: 'గని' నుంచి తమన్నా స్పెషల్ సాంగ్ రిలీజ్!

  • వరుణ్ తాజా చిత్రంగా 'గని'
  • బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ
  • కథానాయికగా సయీ మంజ్రేకర్
  • సంగీత దర్శకుడిగా తమన్
Ghani Special Song Released

వరుణ్ తేజ్ కథానాయకుడిగా కిరణ్ కొర్రపాటి 'గని' సినిమాను రూపొందించాడు. అల్లు బాబీ - సిద్ధు ముద్ద ఈ సినిమాను నిర్మించారు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ ఇది. లవ్ .. యాక్షన్ తో పాటు ఎమోషన్ పాళ్లతో ఈ కథ నడుస్తుంది. ఈ పాత్ర సహజత్వానికి దగ్గరగా అనిపించడం కోసం వరుణ్ తేజ్ విదేశాల్లో బాక్సింగ్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు.

ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా సయీ మంజ్రేకర్ తెలుగు తెరకి పరిచయమవుతోంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా కోసం తమన్నాతో ఒక స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించిన విషయాన్ని కూడా ఇటీవలే రివీల్ చేశారు. సంక్రాంతి సందర్భంగా ఆ పాటను రిలీజ్ చేశారు.

'రింగారే రింగా రింగా .. రింగా రింగా' అంటూ ఈ పాట సాగుతోంది. బాక్సింగ్ రింగ్ లోనే తమన్నా బృందం స్టెప్పులను అదరగొట్టేసింది. తమన్ కంపోజ్ చేసిన బీట్ బాగుంది. అలాగే కొరియోగ్రఫీ కూడా ఆకట్టుకుంటోంది . రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని సమకూర్చిన ఈ పాటను హారిక నారాయణ్ ఆలపించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News