'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' నుంచి కొత్త పోస్టర్ .. టీజర్ రెడీ!
- ఇంద్రగంటి నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్
- సుధీర్ బాబుతో మూడో సినిమా
- వరుస సక్సెస్ లతో ఉన్న కృతి శెట్టి
- ఈ నెల 17వ తేదీన టీజర్ రిలీజ్
వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి, సంక్రాంతి కానుకగా కొత్త పోస్టర్ ను వదిలారు. సుధీర్ బాబు - కృతి శెట్టికి సంబంధించిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా టీజర్ ను ఈ నెల 17వ తేదీన విడుదల చేయనున్నట్టు ఈ పోస్టర్ ద్వారా తెలియజేశారు.
'ఉప్పెన' .. 'శ్యామ్ సింగ రాయ్' .. 'బంగార్రాజు' సినిమాలతో కృతి శెట్టి హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. ఆమె వరుస సక్సెస్ లు ఈ సినిమాకి ప్లస్ కానున్నాయి. ఇక 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా తరువాత సుధీర్ బాబు నుంచి వస్తున్న ఈ సినిమా, ఆయనకి హిట్ ఇస్తుందేమో చూడాలి.